తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ మూడేళ్ల చిన్నారికి రికార్డులు దాసోహం... - kukatpally wonder kid

పిట్ట కొంచెం కూత ఘనం అనే నానుడిని నిదర్శనంగా నిలుస్తుంది ఆ చిన్నారి. మూడేళ్ల వయసులో ముచ్చటగొలిపే వచ్చీరాని మాటలతో శ్లోకాలు, మధుర గేయాలు అలవోకగా ఆలపిస్తోంది. తెలుగు నెలలు, భగవద్గీత, రామాయణాలను చెబుతూ అబ్బుర పరుస్తోంది కూకట్​పల్లి విజయనగర్ కాలనీకి చెందిన మూడేళ్ల చిన్నారి గీతా సుహాని.

wonder kid

By

Published : Oct 1, 2019, 10:10 PM IST

Updated : Oct 3, 2019, 9:51 AM IST

ఈ మూడేళ్ల చిన్నారికి రికార్డులు దాసోహం...

గుంటూరు జిల్లా నుంచి ఉద్యోగరీత్యా హైదరాబాద్​ కూకట్​పల్లికి వచ్చారు మువ్వల అనిల్ కుమార్ లావణ్య దంపతుల కూతురు గీతా సుహాని. ప్రస్తుతం ఎల్​కేజీ చదువుతోంది. చిన్న వయసులోనే రామాయణ, మహా భారతం శ్లోకాలను చెబుతూ అందరినీ అబ్బుర పరుస్తోంది. చిన్నతనం నుంచే టీవీలో సంగీతం, శ్లోకాలు వచ్చినప్పుడు ఆసక్తిగా వినేది. చిన్నారి ఆసక్తిని గమనించిన తల్లి లావణ్య రెండేళ్ల నుంచి ఇంట్లోనే భగవద్గీత శ్లోకాలు, రామాయణం, మహాభారతం, నేర్పించారు.

గీతా సుహాని... దేవుడి పాటలు పాడటమే కాకుండా ర్యాంప్​పై నడుస్తూ హొయలు పోతోంది. 2019 ఆగస్టు నెలలో హైదరాబాద్ బెస్ట్ బేబీ కాంటెస్ట్​లో పాల్గొని తనలోని విభిన్న అంశాల ప్రతిభా పాటవాలను ప్రదర్శించి టైటిల్ విజేతగా నిలిచింది. జులైలో స్టార్ కిడ్స్ ఫ్యాషన్ షోలో పాల్గొని మన్ననలను అందుకుంది. ఆగస్టులో ఎన్​ గ్రూప్ ఆఫ్ ఫ్యాషన్ షోలో పాల్గొని విజేతగా నిలిచింది. 35 తెలుగు శ్లోకాలు చెప్పినందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వారు వండర్ కిడ్ విత్ మల్టిపుల్ స్కిల్ పేరుతో బంగారు పతకం ప్రదానం చేశారు. తాజాగా సూపర్ కిడ్స్ రికార్డు బంగారు పతకం అందజేశారు.

ఆంగ్ల మాధ్యమం పెరిగి తెలుగు అంతరించిపోతున్న ఈ సమయంలో తెలుగులో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఈ చిన్నారిని అభినందిద్దాం.

ఇదీ చూడండి: బాల భీమురాలు పుట్టింది.. చిరునవ్వులు పూయించింది!

Last Updated : Oct 3, 2019, 9:51 AM IST

ABOUT THE AUTHOR

...view details