మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికపై బుధవారం ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఫోన్ చేసిన నంబర్ ఆధారంగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరు పరారీ ఉన్నట్లు తెలిపారు.
మేడ్చల్ జిల్లా సురారం కాలనీకి చెందిన 14 సంవత్సరాల బాలిక ఈ నెల 20న మధ్యాహ్నం బయటకు వెళ్లి.. తిరిగి రాలేదు. బాలిక మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం వెతుకుతున్నారు. దేవేందర్ నగర్లో బాలిక ఒంటరిగా ఉండడాన్ని స్థానిక యువకులు అక్బర్, జుమాన్, గయజ్, అలీంలు గుర్తించారు. జుమాన్ అనే వ్యక్తి ఇంట్లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఆచూకీ ఎలా తెలిసింది..
బుధవారం రాత్రి 9గంటల సమయంలో బాలికకు సదరు యువకులు ఫోన్ ఇచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. హుటాహుటిన బాలిక కుటుంబ సభ్యులు దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్‌డేటా ఆధారంగా ఘటన స్థలికి పోలీసులు చేరుకున్నారు. అప్పటికే అక్కడి నుంచి బాలికను దేవేందర్‌నగర్‌కు తీసుకువచ్చారు. బాలికను గుర్తించిన సమయంలో రెండు ద్విచక్రవాహనాలతో ఉన్న నిందితులు పోలీసులను చూసి పరారయ్యారు. అందులో ఓ వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం గురువారం అతన్ని విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
గురువారం ఉదయం నుంచి దుండిగల్ పోలీస్ స్టేషన్లో బాధితులంతా పడిగాపులు కాశారు. బాలిక అస్వస్థతకు గురికావడం వల్ల.. వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేయడంలో పోలీసులు కొంత జాప్యం చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
దారుణం: బాలికపై సామూహిక అత్యాచారం ఇవీచూడండి:ఉరితో ఏడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన చీర ఉయ్యాల