ఎండల ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. రాష్ట్రంతో పాటు పలు గ్రామాల్లో నీటికోసం కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సివస్తోంది. గ్రామాల్లోని ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు అధికారులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. నీటిని వృథా చేయొద్దు బాబోయ్... నీటిని పొదుపుగా వాడాలి అని నినాదాలు చేస్తుంటే... మెదక్ జిల్లా జనకం పల్లి గ్రామంలో మాత్రం దీనికి భిన్నంగా ఉంది. వాటర్ ట్యాంక్ కింద నీటి తొట్టిలో నుంచి నీరు వృథాగా వెళ్తున్నా... గ్రామస్థులందరూ చొద్యం చూస్తున్నారు. ఇలాగే ఇంకొన్ని రోజులు కొనసాగితే... గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది.
'నినాదాలకే పరిమితం కావొద్దు... పాటించాలి' - WATER
మెదక్ జిల్లా జనకంపల్లి గ్రామంలో వాటర్ ట్యాంక్ కింద ఉన్న నీటి తొట్టిలో నుంచి నీరు వృథాగా పోతుంది. దానిని పట్టించుకునే వారు కరువయ్యారు. నీరు ఇలాగే వృథాగా పోతే.. ఆ గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.
'నినాదాలకే పరిమితం కావొద్దు... పాటించాలి'