బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వెళ్లిన యువకుడు, తనకు తోడుగా ఉంటాడని వెంట తీసుకుని వెళ్లిన అతని అల్లుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద జరిగింది. ఇద్దరూ లారీ ఢీకొనడం వల్ల అక్కడికక్కడే మృతి చెందారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... ఇద్దరు మృతి - ఇద్దరు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన మెదక్ జిల్లా దండుపల్లి వద్ద చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై ఇద్దరు చిన్నశంకరంపేటకు వెళ్తుండగా దండుపల్లి వద్ద లారీ ఢీకొనడం వల్ల ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... ఇద్దరు మృతి
చిన్నశంకరంపేటకు చెందిన వెంకటేష్ నగరంలోని హాస్టళ్లలో వంటలు చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కల్యాణి గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న విజయ్ మామ దగ్గరికి వెళ్లి అక్కడే కొన్ని రోజులుగా ఉంటున్నాడు. వెంకటేష్ ద్విచక్ర వాహనంపై ఇద్దరూ చిన్నశంకరంపేటకు వెళ్తుండగా దండుపల్లి సమీపంలోకి రాగానే మలుపు తీసుకుంటున్న లారీ వారిని ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
ఇవీ చూడండి: ఫోన్ కోసం పురుగుల మందు తాగిన తల్లీకూతుళ్లు