రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంలో దరఖాస్తు సమయంలో నిబంధనలు సడలించాలని కోరుతూ తూప్రాన్ మండల మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ సత్తార్ సీఎం కేసీఆర్‌కు వినతి పత్రం అందజేశారు. బుధవారం నిజామాబాద్ పర్యటన ముగించుకొని ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు వెళ్తున్న సీఎం కేసీఆర్‌కు తూప్రాన్ సెయింట్ ఆర్నాల్డ్ స్కూల్ వద్ద వినతి పత్రంతో నిలబడి ఉన్నా సత్తార్‌ను గమనించిన సీఎం కాన్వాయ్ ఆపారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ నిబంధనలను సడలించాలని సీఎంకు విన్నపం - telangana varthalu
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంలో దరఖాస్తు సమయంలో నిబంధనలు సడలించాలని కోరుతూ తూప్రాన్ మండల మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ సత్తార్ సీఎం కేసీఆర్‌కు వినతి పత్రం అందజేశారు. సత్తార్ వినతిపత్రంతో నిలబడి ఉండడం చూసి స్వయంగా ఆయనే కాన్వాయ్ ఆపి ఆ పత్రాన్ని తీసుకున్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ నిబంధనలను సడలించాలని సీఎంకు విన్నపం
తన భద్రతా సిబ్బంది ద్వారా సత్తార్ చేతిలో ఉన్న వినతిపత్రాన్ని తీసుకున్నారు. కాగా షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి దరఖాస్తు సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని, అధికారుల చుట్టూ తిరుగుతున్నారని ఆయన వినతి పత్రంలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Kandikonda: కందికొండ చికిత్స కోసం మంత్రి కేటీఆర్ చేయూత
Last Updated : Jun 9, 2021, 10:51 PM IST