తెలంగాణ

telangana

ETV Bharat / state

అస్వస్థతకు గురైన వారందరికీ వైద్య పరీక్షలు చేయిస్తాం

రెండు రోజుల క్రితం విద్యార్థినిలు కలుషిత ఆహారం తీసుకుని అస్వస్థతకు గురైన ఘటనలో జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి ఆ పాఠశాలను సందర్శించారు. తాగు నీటిని మినరల్ వాటర్ ప్లాంట్ నుంచి సరఫరా చేస్తున్నందున వాటిని పరీక్షిస్తామని తెలిపారు. నివేదిక ఆధారంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

కలుషిత ఆహారం తీసుకుని అస్వస్థతకు గురైన విద్యార్థినిలు

By

Published : Mar 27, 2019, 5:51 PM IST

అస్వస్థతకు గురైన వారందరికీఆరోగ్య పరీక్షలు చేయిస్తాం : కలెక్టర్
మెదక్ జిల్లా హావేలి ఘనాపూర్ మండల పరిధిలో మహాత్మా జ్యోతి బాపూలే బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లుతో కలిసి పాఠశాలలను పరిశీలించారు. అస్వస్థతకు గురైన వారందరికీఆరోగ్య పరీక్షలు చేయిస్తామని కలెక్టర్ తెలిపారు.

ఒక్కరు మినహా అందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది

రాష్ట్ర బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య బట్టు తదితర అధికారులు పాఠశాలను పర్యవేక్షించారు. మెుదటి రోజు 20 మంది విద్యార్థులు చికిత్స పొంది అదే రోజు డిశ్చార్జి అయ్యారని మల్లయ్య బట్టు అన్నారు. మరుసటి రోజు మరో 30 మంది ఆసుపత్రిలో చేరగా ఒక్కరు మినహా అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. విద్యార్థినిలుతాగే నీరు, ఆహారం పరీక్షల నిమిత్తం ల్యాబ్​కు పంపించామని, సాయంత్రం వరకు ఫలితాలు అందుతాయని తెలిపారు.

48 గంటల్లోగా కలెక్టర్​కు నివేదిక
తాగు నీటిని, ఆహారాన్ని పరిశీలించిన ఆహార తనిఖీ అధికారి 48 గంటల్లోగా కలెక్టర్​కు నివేదిక అందిస్తామని తెలిపారు. విద్యార్థులకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.

ఇవీ చూడండి :శరత్​.... నేను కేసీఆర్​ను మాట్లాడుతున్నా


ABOUT THE AUTHOR

...view details