తెలంగాణ

telangana

ETV Bharat / state

భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని.. భర్త ఆత్మహత్య - wife

భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని.. భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్​లో చోటుచేసుకుంది.

భర్త ఆత్మహత్య

By

Published : Sep 27, 2019, 9:39 PM IST

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్​లో భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన నత్తి యాదగిరికి ఆండాల్​ అనే మహిళతో వివాహం జరిగింది. ఆమెకు సంతానం కలగలేదు. యాదగిరి మంజుల అనే మరో మహిళతో రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. మంజుల ఆడపిల్లకు జన్మనిచ్చింది. అంతా బానే ఉన్నా.. మంజుల అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వారం క్రితం ఏటో వెళ్లిపోయింది. ఈ విషయం పోలీస్​స్టేషన్ వరకు వెళ్లింది. అవమాన భారం భరించలేని యాదగిరి ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పపడ్డాడు.

భర్త ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details