తెలంగాణ

telangana

ETV Bharat / state

జుట్టు కత్తిరింపు వ్యవహారంలో ప్రిన్సిపల్ తప్పేమి లేదు - మెదక్

శనివారం మెదక్ జిల్లా ఎస్టీ మిని గురుకుల పాఠశాలలో విద్యార్థుల జుట్టు కత్తిరింపు వ్యవహారంలో ప్రిన్సిపల్ తప్పిదం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు, ఎరుకల సంఘం నాయకులు తెలిపారు.

ప్రిన్సిపల్ తప్పేమి లేదు

By

Published : Aug 16, 2019, 6:08 PM IST

మెదక్ జిల్లా ఎస్టీ మిని గురుకుల పాఠశాలలో శనివారం రోజు జరిగిన జుట్టు కత్తిరింపు వ్యవహారంపై.. ఈరోజు జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డికి విద్యార్థినిల తల్లిదండ్రులు వినతిపత్రం అందజేశారు. పాఠశాలలోని బోరుబావిలో నీరు రాకపోవడం వల్ల 180 మంది విద్యార్థులలో 120 మంది విద్యార్థులకు జుట్టు చిన్నగా చేయించారు. నీటి వసతి లేక లేకపోవడం వల్లే.. పిల్లలకు జుట్టు కత్తిరించారని ఇందులో ఆమె తప్పిదం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు, ఎరుకల సంఘం నాయకులు తెలిపారు. పాఠశాలలో నీటి వసతి కల్పించాలని.. బోర్లు వేయించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరారు.

ప్రిన్సిపల్ తప్పేమి లేదు

ABOUT THE AUTHOR

...view details