మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన ఓ వృద్ధురాలికి (80) భర్త, పిల్లలు ఎవరూ లేరు. చెల్లెలి కుమారుల వద్ద తలదాచుకునేది. ఆమెకు, ఆమె ఉండే ఇంట్లోని వారందరికీ కరోనా సోకింది. ఆ వృద్ధురాలు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. ఆ ఇంట్లోని వారెవరూ అంత్యక్రియలు చేసే పరిస్థితి లేదు. చుట్టుపక్కలవారు, బంధువులూ ముందుకు రాలేదు. పురపాలిక పారిశుద్ధ్య సిబ్బంది అంత్యక్రియలకు ముందుకొచ్చారు.
4 గంటలు చెత్త బండిలోనే మృతదేహం!
'నా అనేవారు' ఎవరూ లేని ఓ అవ్వ కాలం చేస్తే.. ఆమెను చెత్త తీసుకెళ్లే వాహనంలో తరలించి అంత్యక్రియలు చేసిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది.
The corpse was kept in the garbage cart for 4 hours
చెత్త తీసుకెళ్లే వాహనంలో మృతదేహాన్ని తరలించారు. కరోనాతో చనిపోవడం వల్ల గుంత తవ్వేందుకు జేసీబీ యంత్రాల యజమానులు ససేమిరా అన్నారు. వారితో మాట్లాడి నాలుగో వార్డు కౌన్సిలర్ యాదగిరి ఒప్పించారు. అప్పటివరకు సుమారు నాలుగు గంటల పాటు మృతదేహం చెత్తబండిలోనే ఉంది.
ఇదీ చదవండి:పల్లెలను కబళిస్తున్న కరోనా మహమ్మారి