స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి మెదక్ జిల్లా పరిశీలకుడు నగేశ్ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను ఇప్పటివరకు తెరాస అమలు చేయలేదని విమర్శించారు. సింగూరు జలాలను అక్రమంగా ఇతర ప్రదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు ఇప్పటికీ సక్రమంగా సరఫరా చేయట్లేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు మనోనిబ్బరంతో ఉండాలని, వచ్చేది మన ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
'స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి' - NAGESH
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ సూచించారు. కేంద్రంలో వచ్చేది తమ ప్రభుత్వమేనని కార్యకర్తలు ఓర్పుతో ఉండాలని కోరారు.
సింగూరు జలాలను అక్రమంగా ఇతర ప్రదేశాలకు తరలిస్తున్నారు : నగేష్