క్షయ నివారణ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మెదక్ జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అత్యంత ప్రమాదకరమైన క్షయవ్యాధి నిర్మూలనకు 22 సంవత్సరాలుగా కృషి చేస్తున్నా... ఎటువంటి ఆరోగ్య భద్రత సదుపాయాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్, ఆరోగ్య భద్రత కార్డు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న జీవో నెంబర్ 27 ప్రకారం తెలంగాణలో వేతనాల పెంచి ఏప్రిల్ 2018 నుంచి ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు క్షయ వ్యాధి సోకితే... నయమయ్యే వరకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని కోరారు.
సమస్యల పరిష్కారానికి క్షయ నివారణ ఉద్యోగుల ధర్నా - tb deportment
సమస్యల పరిష్కారించాలని మెదక్ జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు క్షయ నివారణ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమ్మె చేశారు.
సమస్యల పరిష్కారానికి క్షయ నివారణ ఉద్యోగుల ధర్నా