తెలంగాణ

telangana

ETV Bharat / state

హస్తం​ను వీడి... కారెక్కుతున్న సునీతా..! - kcr

కాంగ్రెస్​కు మరో షాక్. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కారెక్కనున్నారు. పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడం... తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే కారణాలతో కొద్దికాలంగా అసంతృప్తిగా ఉన్నారు. హస్తంను వీడి తెరాసలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు.

తెరాసలోకి చేరనున్న సునీతా లక్ష్మారెడ్డి

By

Published : Mar 26, 2019, 12:51 PM IST

Updated : Mar 26, 2019, 2:42 PM IST

తెరాసలోకి చేరనున్న సునీతా లక్ష్మారెడ్డి
మెదక్‌ డీసీసీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఇవాళ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అమలు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్​ను వీడాలని నిర్ణయం తీసుకున్నారు.

తగిన గుర్తింపు లేకపోవడం...
కాంగ్రెస్‌లో తగిన గుర్తింపు ఇవ్వకపోవడం...పార్టీ తీసుకునే నిర్ణయాల్లో కూడా ప్రాధాన్యత
కల్పించడం లేదంటూ సునీతా లక్ష్మారెడ్డి పార్టీని వీడాలనే యోచనకు వచ్చారు.

కేటీఆర్​ను కలిసి...
నేడు సునీతా హైదరాబాద్​లో కేటీఆర్‌ను కలిశారు. తెరాసలోకి చేరాలని నిర్ణయించుకున్నారు. నేడు నర్సాపూర్​లో జరిగే కేసీఆర్‌ బహిరంగ సభలో గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి:'పార్టీ మారడం అంటే మరణంతో సమానం'

Last Updated : Mar 26, 2019, 2:42 PM IST

ABOUT THE AUTHOR

...view details