ఆందోళన చేపట్టిన విద్యార్థులు మెదక్ జిల్లా కౌడిపల్లి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పరీక్ష రాస్తున్న విద్యార్థిని స్క్వాడ్ కొట్టారంటూ... సహచర విద్యార్థులు ధర్నా చేశారు. కాపీయింగ్‌కు పాల్పడ్డాడని పర్యవేక్షణాధికారిణి కాలర్ పట్టుకుని కొట్టారని తెలిపారు. ఎందుకు కొడుతున్నారని అడిగినా... వినిపించుకోలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారమంతా పరీక్షకేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది.
విద్యార్థి ఆత్మహత్యాయత్నం
మనస్తాపంతో ఆ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పరీక్షలు ముగిసిన అనంతరం విద్యార్థులు కళాశాల ఎదుట ధర్నా చేశారు. ప్రైవేట్ పాఠశాల పరీక్షా కేంద్రాలకు వెళ్లకుండా ఇక్కడికే వస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులకు పోలీసులు సముదాయించి ఆందోళన విరమింపజేశారు.
కాపీ చేస్తే డిబార్ చేయాలని... కొట్టడం ఏంటని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని కొట్టిన విషయం తమదృష్టికి రాలేదని ఎస్సై తెలిపారు. ఫిర్యాదు వస్తే విచారణ చేపడుతామని చెప్పారు.
ఇవీ చూడండి:ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం