వెల్దుర్తికి చెందిన శివకృష్ణ, ఇందిర దంపతులది సామాన్య రైతు కుటుంబం. వీరికి ఇద్దరు కూతుళ్లు కట్టెల నందిని, కట్టెల శ్రీవాణి. క్రీడల పట్ల వారి ఆసక్తిని గమనించిన పాఠశాల పీడీ ప్రతాప్‌సింగ్ రాథోడ్ ఫ్లోర్‌బాల్, రగ్బీలో శిక్షణ ఇచ్చారు. పదో తరగతి చదువుతున్న నందిని ఫ్లోర్‌బాల్, రగ్బీ క్రీడలో జాతీయ స్థాయిలో పాల్గొంది. 8వ తరగతి చదువుతున్న శ్రీవాణి రగ్బీలో రెండు సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది.
వెల్దుర్తి అక్కాచెల్లెల్లు...ఆదర్శవంతులు... - veldurthi
వారిద్దరు తోబుట్టువులు. చదువులోనే కాదు క్రీడల్లో సైతం ప్రతిభ కనబరుస్తున్నారు. జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటూ నైపుణం ప్రదర్శిస్తున్నారు వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు.
Breaking News
నందిని ఫ్లోర్‌బాల్ క్రీడలో జిల్లా స్థాయిలో మెదక్‌లో, రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌లో పాల్గొని జాతీయ స్థాయికి ఎంపికైంది. శ్రీవాణి 2017 నవంబర్‌లో, 2018 జనవరిలో హైదరాబాద్‌లో జరిగిన రగ్బీ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు కృషి చేస్తున్నామని వారు అంటున్నారు.
ఇదీ చూడండి:గురుకుల పాఠశాలలో వికటించిన భోజనం