మహాశివరాత్రి సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవాని మాతను దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.
సాధారణ భక్తుడిగా వచ్చా: సంగారెడ్డి ఎమ్మెల్యే - మెదక్ జిల్లా
మెదక్ జిల్లాలోని ఏడుపాయలను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సందర్శించారు. భవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గతంలో అమ్మవారికి బంగారు కిరీటం చేయించానని గుర్తు చేశారు.
సాధారణ భక్తుడిగా వచ్చా: సంగారెడ్డి ఎమ్మెల్యే
దుర్గామాత భక్తుడైన తాను గతంలో అమ్మవారికి బంగారు కిరీటం చేయించానని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో మళ్లీ వనదుర్గా మాతకు బంగారు ఆభరణాలు సమర్పిస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా కాకుండా సాధారణ భక్తుడిగా.. తాను ఏడుపాయలకు వచ్చానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చూడండి:శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు