మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించాలని... బెల్టు షాపులు మూసివేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మద్యాన్ని తాగి ప్రజలు ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారని గ్రామస్థులు వాపోయారు. గ్రామంలో ఎవరూ మద్యం అమ్మకూడదని బెల్టుషాపుల యజమానులను హెచ్చరించారు. శనివారం నుంచి ఎవరైనా మద్యం అమ్మితే రూ.పది వేల జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు.
ఊరంతా ఏకం... మద్యపాన నిషేధానికి తీర్మానం
ఎంత చెప్పినా మందు బాబుల ఆగడాలను ఆపలేకపోయారు కోనాపూర్ గ్రామ మహిళలు. పోలీసులు హెచ్చరించినా బెల్టు షాపుల నిర్వాహకులు యథేచ్ఛగా మద్యం విక్రయిస్తున్నారు. మద్యం మత్తులో చాలామంది రోడ్డు ప్రమాదాల పాలవగా... మరికొందరు ఇల్లు, పిల్లలని పట్టించుకోకుండా వీరంగం చేస్తున్నారు. ఆగ్రహించిన మహిళలంతా ఏకమై మద్యపాన నిషేధానికి తీర్మానం చేశారు.
ఊరంతా ఏకమై... మద్యపాన నిషేధానికి తీర్మానం
గ్రామంలో నాలుగు బెల్టు షాపులు ఉన్నాయని... కొన్ని రోజులుగా మద్యం తాగి చాలామంది ప్రమాదాల బారిన పడ్డారని గ్రామస్థులు తెలిపారు. మద్యం మత్తులో మరికొందరు వీరంగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఊరంతా ఏకమై ఈ తీర్మానం చేసినట్లు వివరించారు.
ఇదీ చదవండి:కేసీఆర్ ఫోన్: నాగిరెడ్డి పంటెట్టున్నది... విత్తనాలు ఎక్కడ తెచ్చినవ్!