మెదక్ జిల్లాలో 4 పురపాలికలు మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్‌కు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను కలెక్టర్ ధర్మారెడ్డి లక్కీ డ్రా తీశారు. రాజకీయ పార్టీల సమక్షంలో వార్డుల వారీగా రిజర్వేషన్లు లాటరీ పద్ధతిలో వెల్లడించారు. నాలుగు మున్సిపాలిటీల్లోని 76,695 ఓటర్లకు గాను 75 వార్డులకు రిజర్వేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినట్లు కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు.
మొదట ఎస్టీకి చెందిన రిజర్వేషన్లను ఖరారు చేశారు. అనంతరం ఎస్సీ రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు.
'4 పురపాలికలకు... రిజర్వేషన్లు ఖరారు' - MEDAK DISTRICT COLLECTOR
మెదక్ జిల్లాకు సంబంధించిన నాలుగు మున్సిపాలిటీల రిజర్వేషన్లకు కలెక్టర్ ధర్మారెడ్డి లక్కీ డ్రా తీశారు. అనంతరం వాటిని వెల్లడిస్తూ ఆ ప్రక్రియను ఖరారు చేశారు.
'లాటరీ పద్ధతిలోనే రిజర్వేషన్లు ఖరారు'
ఇవీ చూడండి : 'పుర పోరుపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి కుట్ర'