తెలంగాణ

telangana

పొంగిపొర్లుతున్న పండి వాగు.. ఆనందంలో అన్నదాతలు

By

Published : Aug 16, 2020, 5:17 PM IST

కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లా నర్సాపూర్​ సమీపంలోని పండి వాగు పొంగిపొర్లుతోంది. అక్కడి నుంచి నీరు అడవుల్లోకి వెళుతుందని... అక్కడ నివసించే వన్యప్రాణుల కష్టాలు తీరనున్నాయని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.

heavy rainfall in medak district
పొంగిపొర్లుతున్న పండి వాగు.. సంతోషం వ్యక్తం చేసిన రైతులు

మెదక్ జిల్లా నర్సాపూర్​ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న చెక్​డ్యాంలు నిండాయి. వరద ఉద్ధృతి పెరగ్గా పండివాగులోకి నీరు పారగా వాగు నిండుకుండను తలపిస్తోంది.

కొద్దిరోజులుగా కురుస్తున్న వానలకు చెరువులు, వాగులు నిండగా.. అడవుల్లోని వన్యప్రాణులకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి. మోడుబారిన చెట్లు జీవం పోసుకుని పచ్చగా మారనున్నాయి. చాలా ఏళ్లకు వానలు కురవగా ఎండిపోయిన భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు, పట్టణవాసులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీచూడండి: ఇవాళ, రేపు భారీ వర్షాలు..19న మరో అల్పపీడనం

ABOUT THE AUTHOR

...view details