మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్ పేటలో కరోనా కలకలం రేగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్‌తో మృత్యువాతపడ్డాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. మూడురోజుల క్రితం గ్రామానికొచ్చాడు. ఊరిలో విందులో పాల్గొన్నాడు. తర్వాత రోజు తీవ్ర అస్వస్థతకు గురవ్వడం వల్ల మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. కొవిడ్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. పరిస్థితి విషమించడం వల్ల వెంటనే గాంధీకి తరలించారు.
యూసఫ్ పేటలో కరోనాతో వ్యక్తి మృతి
పాపన్నపేట మండల పరిధి యూసుఫ్ పేటలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన (35) వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
covid, medak covid
రెండు రోజులుగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతని భార్యకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉంది. విందులో పాల్గొన్న అందరికీ కొవిడ్ పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్న గవర్నర్ తమిళిసై