తెలంగాణ

telangana

ETV Bharat / state

మాట వినట్లేదని కన్నకొడుకును పథకం ప్రకారం హత్య - మాట వినట్లేదని కన్నకొడుకును పథకం ప్రకారం హత్య

మాట వినట్లేదనే కోపంతో సోదరుల సహాయాన్ని తీసుకుని కన్నకొడుకును ఈ నెల 7న కడతేర్చాడు ఓ తండ్రి. ఈ ఘటనలో నిందితులైన నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు పంపారు.

MURDER CASE ACCUSED ARRESTED IN MEDAK

By

Published : Oct 15, 2019, 11:54 PM IST

మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్​లో ఈ నెల 7న జరిగిన హత్య కేసులోని నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తన కొడుకు మాట వినట్లేదనన్న కోపంతో పథకం ప్రకారమే హత్య చేసినట్లు నిందితుడైన తండ్రి పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. తండ్రి నారాయణరెడ్డి తన సోదరులు రాంరెడ్డి, హనుమంతరెడ్డి, చిన్ననాన్నకొడుకు కిష్టారెడ్డి సహాయంతో శ్రవణ్​కుమార్​కు మద్యం తాగించాడు. అనంతరం ఇంట్లో పడుకున్నాక గొంతు నులిమి చంపి... ఇంటి వద్దే పాతిపెట్టారని పోలీసులు వెల్లడించారు.

మాట వినట్లేదని కన్నకొడుకును పథకం ప్రకారం హత్య

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details