మూడంచెల భద్రత నడుమ లెక్కింపు కేంద్రాలు - mp
ఎంపీ ఓట్ల లెక్కింపునకు కేంద్రాలు సిద్ధమయ్యాయి. మూడంచెల భద్రతల నడుమ ఈ నెల 23వ తారీఖు కౌంటింగ్ చేయనున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
లెక్కింపు కేంద్రాలు
మెదక్ ఎంపీ ఓట్ల లెక్కింపు కేంద్రాలను నర్సాపూర్ పట్టణంలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, గురుకుల పాఠశాల, ఇంజనీరింగ్ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా మూడంచెల విధానంలో భద్రతా ఏర్పాట్లు చేశామని నర్సాపూర్ సీఐ సైదులు తెలిపారు. పాసులు లేని వారిని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించమని తెలిపారు. ఈవీఎంల ప్రక్రియ కోసం అధికారులు లోపల ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని సీఐ వెల్లడించారు.