మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం జక్కపల్లి వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి రోడ్డు కిందికి వెళ్లింది. పక్కనే పంట పొలాల్లో ఉన్న రైతులు వెంటనే విద్యార్థులను కిందికి దించారు. ఆ సమయంలో బస్సులో 16 మంది విద్యార్థులు ఉన్నారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి అదే బస్సులో విద్యార్థులను ఇళ్లకు చేర్చారు.
అదుపు తప్పిన ప్రైవేటు బస్సు... తప్పిన పెనుప్రమాదం - మెదక్ జిల్లా
మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి, రోడ్డు కిందికి వెళ్లింది.
అదుపు తప్పిన ప్రైవేటు బస్సు....