మెదక్ జిల్లాలో తూప్రాన్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా ఉంచాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. తూప్రాన్‌లో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను పరిశీలించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ కార్యాలయం, డబుల్‌బెడ్‌రూమ్‌ల నిర్మాణాలను పరిశీలించి... పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకొన్నారు.
'తూప్రాన్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా ఉంచాలి'
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. తూప్రాన్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా ఉంచాలని అధికారులకు సూచించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు.
మున్సిపల్ బిల్డింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు. మహిళల కాన్ఫరెన్స్ హాల్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పౌరసేవా కేంద్రం ప్రజలకు ఉపయోగపడేలా చూడాలన్నారు. పనులు జరుగుతున్న తీరును వాట్సాప్‌లో ఫొటోలు తీసి ఎప్పటికప్పుడు తనకు పంపించాలన్నారు. పర్యటనలో మంత్రి వెంట మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, గడా ఆఫీసర్ ముత్యంరెడ్డి, ఆర్డీవో శ్యామ్‌ప్రకాశ్, వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.