నిజాం పాలన నుంచి తెలంగాణ వచ్చేంతవరకు రైతులు.. ప్రభుత్వానికి వన్నులు కట్టారని.. మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆ చరిత్రను తిరగరాసి సీఎం కేసీఆర్.. రైతులకు పెట్టబడి సాయం కింద రూ.10 వేలు ఇచ్చారన్నారు.
మెదక్ పట్టణంలోని జీకేఆర్ గార్డెన్లో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఐదుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు తెరాసలో చేరారు. వారందరికి హరీశ్‌రావు.. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వారిది చీకటి ఒప్పందం..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భాజపాపై పోరాడమంటే.. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు మాత్రం తెరాసపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి హరీశ్ మండిపడ్డారు. దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. అందువల్లనే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కనీసం కార్యకర్తల సమావేశం కూడా పెట్టలేదన్నారు. తెరాసను ఎదుర్కొలేక ఇరుపార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. వ్యవసాయ బిల్లులపై భాజపా విమర్శించడం మాని.. తెరాసను తిడుతున్నారని.. కాంగ్రెస్ తీరును ప్రజలు నవ్వుకుంటున్నారని హరీశ్ ఎద్దేవా చేశారు.