సింగూరు కాలువ ద్వారా ఆ ప్రాంతానికి కాళేశ్వరం జలాలు అందిస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని నార్సింగ్, రామాయంపేట్, నిజాంపేట్ మండలాల్లో ఆమె అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో 100 శాతం డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తయిందని, పల్లె ప్రగతిలో చేపట్టిన కార్యక్రమాల ద్వారా సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.
‘సింగూరు కాలువ ద్వారా.. కాళేశ్వరం జలాలు అందిస్తాం’ - మెదక్ వార్తలు
సాగునీరు, తాగునీరుకు సింగూరు ప్రజలు ఇబ్బంది పడకుండా త్వరలో సింగురూ కాలువ ద్వారా కాళేశ్వరం జలాలను అందిస్తామని, నీటి కష్టాలు తొలగిపోయే సమయం ఆసన్నమైందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని నార్సింగ్, రామాయంపేట్, నిజాంపేట్ మండలాల్లో ఆమె పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు.
‘సింగూరు కాలువను.. కాళేశ్వరం జలాలతో నింపుతాం’
ఆడబిడ్డలు నీటికి ఇబ్బంది పడకుండా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా ఏర్పాటు చేశారని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ నల్లా ఏర్పాటు చేయడం దాదాపు పూర్తయిందని అన్నారు. నిజాంపేట మండలంలో 19వేల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా సాగునీరు అందిస్తామని అన్నారు. రైతుల క్షేమం కోరి.. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత వ్యవసాయ విధానం, రైతు వేదిక అనే కొత్త పద్ధతులను తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.