తెలంగాణ

telangana

ETV Bharat / state

'పరిహారం పెంచండి'

కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులు ఆందోళన బాట పట్టారు. మెదక్​ జిల్లాలో పనులను అడ్డుకున్నారు. ప్రభుత్వం చెల్లించిన నష్ట పరిహారం సరిపోదని.. పెంచాలని డిమాండ్​ చేశారు. నిర్వాసితుల సమస్యను ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు తెలిపారు.

మెదక్​ రైతులు

By

Published : Feb 27, 2019, 8:09 PM IST

పరిహారానికి రైతుల ఆందోళన
మెదక్​ జిల్లా నర్సాపూర్​ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతులు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. 2015లో భూములు తీసుకున్న ప్రభుత్వం ఎకరానికి రూ.7.50 లక్షలు మాత్రమే ఇచ్చిందని.. దీనిని రూ.30 లక్షలకు పెంచాలని డిమాండ్​ చేశారు. న్యాయం జరిగే వరకు పనులను అడ్డుకుంటామని అన్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి

భూ నిర్వాసితుల సమస్యలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని తహసీల్దార్​ తెలిపారు. రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details