మెదక్ జిల్లాలో ఓ వివాహిత కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉండేది. ఆదివారం ఉదయం అవుసులపల్లి శివారులో బోయిన్పల్లి విష్ణువర్ధన్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఆమె మృతదేహం ఓ చెట్టు కింద పడి ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, సీఐలు వెంకట్, రాజశేఖర్, ఎస్ఐ లింబాద్రి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై ఎలాంటి బట్టలు లేకుండా నగ్నంగా ఉండడంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమెను చీరతో ఉరి వేసినట్లు కూడా గుర్తులు ఉన్నట్లు తెలిపారు. సంఘటన స్థలంలో చెప్పులు, మద్యం బాటిళ్లు, ఇతర వస్తువులు లభ్యమయ్యాయని డీఎస్పీ పేర్కొన్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మెదక్ జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి - స్థితి
వివాహిత అనుమానాస్పద మృతి ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘనపురం మండలం ఔరంగాబాద్ స్కూల్ తండాలో చోటుచేసుకుంది.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి