మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యం తేమశాతం వచ్చాకే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం సాయంత్రం చిన్న శంకరంపేట మండలం కొర్విపల్లి వద్ద రోడ్డుపై వడ్లను ఆరబెట్టిన రైతులను చూసి తన వాహనాన్ని ఆపి రైతులతో మాట్లాడారు.
ప్రస్తుతం కొన్నిచోట్ల వరి నూర్పిడి పూర్తి అయిందని... అయితే అకాల వర్షాలు పడటం వడ్లను రోడ్డుపై ఎండబెట్టామని రైతులు కలెక్టర్కు వివరించారు. దీనికి స్పందించిన కలెక్టర్ హనుమంతరావు... ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.