కరోనా తీవ్రత గురించి ఎంత చెప్పినా.. 15 శాతం మంది ప్రజలు లాక్‌డౌన్‌ను లెక్కచేయడం లేదని మెదక్ ఏఎస్పీ నాగరాజు తెలిపారు. లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలకు కల్పించిన వెసులుబాటును, సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుందని.. ఏదో ఒక వంకతో ఇంటి నుంచి బయటకు వస్తున్నారని వివరించారు. కిరాణాషాపుల వద్ద, అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెడుతూ.. కరోనాతో తమకేమి ప్రమాదం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇది చాలా బాధాాకరమైన విషయమన్నారు.
15 శాతం మంది మాట వినడం లేదు: ఏఎస్పీ
ప్రతి ఒక్కరు నిర్లక్ష్య ధోరణి వీడి, బాధ్యతగా వ్యవహరించాలని మెదక్ ఏఎస్పీ నాగరాజు తెలిపారు. రోజురోజుకూ ప్రభలుతోన్న కరోనాను నివారించడానికి ప్రజల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. 15 శాతం మంది ప్రజలు లాక్‌డౌన్‌ను లెక్కచేయడం లేదని వెల్లడించారు. ఇది చాలా భాదాకరమైన విషయమన్నారు.
15శాతం మంది మాట వినడం లేదు: ఏఎస్పీ
కరోనా మహమ్మారిని అదుపుచేయడానికి ప్రజలు సహకరించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించాలన్నారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి:'కేసీఆర్... నిన్ను నాయినా అని పిలవనా