మేడ్చల్ జిల్లా బహుదూర్‌పల్లికి చెందిన రామకృష్ణ డ్రైవర్‌గా చేస్తూ జీవనం సాగించేవాడు. ఎన్ని రోజులు పని చేసినా.. కష్టాలు తీరవన్న ఉద్దేశంతో.. పైనాన్స్‌లో ఆటో ట్రాలీ కోనుగోలు చేశాడు. రెండు నెలలకే కరోనా వల్ల లాక్ డౌన్ వచ్చింది. అయినా రామకృష్ణ నిరాశ చెందలేదు. మంచి రోజుల కోసం ఎదురు చూశాడు. లాక్ డౌన్ అనంతరం తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. సోమవారం హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు ట్రాలీలో వాటర్ బబుల్స్ లోడుతో వెళ్లాడు. అక్కడ వాటిని దించేసి.. వాటికి సంబంధించి సుమారు రూ.56వేలు తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. తూప్రాన్ సమీపంలోని టోల్ గేటు వద్దకు చేరుకునే సరికి బాగా రాత్రి అవడంతో అక్కడే నిద్రించాడు.
మరో మార్గం లేక
ఉదయం నిద్రలేచిన తర్వాత తన వద్ద ఉన్న డబ్బులను ఎవరో దొంగలించారని గుర్తించాడు. టోల్ సిబ్బంది వద్దకు వెళ్లి జరిగింది వివరించగా.. పోలీసులకు ఫిర్యాదు చేయమని వారు సూచించారు. 100కు ఫోన్ చేసిన రామకృష్ణ.. తన డబ్బులు పోయాయని... వాటిని యజమాని ఇవ్వడానికి తన వద్ద డబ్బులు లేవని.. తనకు మరో మార్గం లేక.. ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. ట్రాలీకి తాడుతో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.