మెదక్ జిల్లా కొండపాకలో మెదక్-సంగారెడ్డికి బస్సు సర్వీస్‌ను ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రారంభించారు. పేద ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రశంసించారు. కొడుపాక గ్రామానికి డ్రైనేజ్ కోసం పది లక్షల రూపాయలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల తిమ్మయాపల్లిలో చనిపోయిన చిన్నారుల కుటుంబాలను పరామర్శించారు. రెండు లక్షల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించారు.
కేసీఆర్ ప్రజల కష్టాలు తెలిసిన సీఎం - mla
ప్రజలకు ఎక్కడైతే కష్టాలు ఉంటాయో అక్కడ కేసీఆర్ పథకాలు ఉంటాయన్నారు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి. మెదక్ జిల్లా కొండపాకలో బస్ సర్వీస్‌ను ప్రారంభించారు.
బస్సు సర్వీస్ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే
ఇదీ చూడండి: బంగ్లాదేశ్ మార్కెట్.... ఇక్కడ అన్ని చవకే!