తెలంగాణ

telangana

ETV Bharat / state

'మూడు సంవత్సరాల్లోనే పూర్తి' - kaleswaram

మూడు సంవత్సరాల్లోనే కన్నేపల్లి, మేడిగడ్డ వద్ద బ్యారేజిలు పూర్తి చేసుకున్నామని మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో తెరాస నిర్వహించిన సంబురాల్లో ఆమె పాల్గొన్నారు.

బతుకమ్మ ఆడుతున్న ఎమ్మెల్యే

By

Published : Jun 21, 2019, 9:19 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్​ జిల్లా కేంద్రంలో తెరాస నాయకులు సంబురాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయం నుంచి రాందాస్​ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపుగా 45 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి అన్నారు. మూడు సంవత్సరాల్లోనే కన్నేపల్లి, మేడిగడ్డ వద్ద బ్యారేజిలు పూర్తి చేసిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్, వైస్ ఛైర్మన్ రాగి అశోక్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

'మూడు సంవత్సరాల్లోనే పూర్తి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details