తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ,కర్ణాటక ఎక్సైజ్​ పోలీసుల సమావేశం

ఎన్నికలవేళ అక్రమ  మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని తెలంగాణ, కర్ణాటక ఎక్సైజ్​ పోలీసులు నిర్ణయించారు. ఇవాళ జహీరాబాద్​లో ఇరురాష్ట్రాలకు చెందిన అధికారులు సమావేశమయ్యారు. మద్యం అక్రమ రవాణా అరికట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

తెలంగాణ,కర్ణాటక ఎక్సైజ్​ పోలీసుల సమావేశం

By

Published : Mar 29, 2019, 7:31 PM IST

తెలంగాణ,కర్ణాటక ఎక్సైజ్​ పోలీసుల సమావేశం
లోక్​సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జాగ్రత్తగా వ్యహారించాలని తెలంగాణ-కర్ణాటక ఎక్సైజ్​ పోలీసులు నిర్ణయించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఇరురాష్ట్రాల అబ్కారీ అధికారుల అంతర్​రాష్ట్ర సరిహద్దు సమావేశం జరిగింది. ఎన్నికలవేళ అక్రమ మద్యం ప్రవాహ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై భేటీలో చర్చించారు. మద్యం అక్రమ రవాణా అరికట్టేందుకు మైత్రి బంధంతో ముందుకు సాగాలని సమావేశంలో తీర్మానించారు. సంగారెడ్డి జిల్లాతో పాటు కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా జిల్లాల ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, సీఐలు, ఎస్సైలు అంతరాష్ట్ర భేటీకి హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల సరిహద్దులోని గ్రామాల మీద ప్రత్యేక దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.బి శాస్త్రి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details