మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాలలో చదువుతున్న 6,7వ తరగతికి చెందిన 160 మంది విద్యార్థులను.. వసతుల సాకుతో మెదక్‌కి తరలించొద్దని ధర్నా నిర్వహించారు. ఇక్కడ చదువుతున్న పిల్లలను 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్‌కు తరలించే ప్రయత్నం మానుకోవాలనీ.. ఇక్కడ ఉన్న వసతులు వేరే ఎక్కడా లేవని, కొత్త చోట పిల్లలకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. మానసిక వేదనకు కూడా గురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని తల్లిదండ్రులు హెచ్చరించారు.
విద్యార్థుల తరలింపు వద్దని తల్లిదండ్రుల నిరసన.. - విద్యార్థుల
మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేశారు. పాఠశాలలో 6,7వ తరగతిలోని 160 మంది విద్యార్థులను మెదక్ తరలించవద్దని నిరసన వ్యక్తం చేశారు.
విద్యార్థుల తరలింపునకు తల్లిదండ్రుల నిరసన..