మెదక్ జిల్లా మెదక్ మండలం మాచవరం గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ లేఅవుట్లను ఏర్పాటు చేస్తున్నారని సర్పంచి సంధ్యారాణి అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్, ఇతర సిబ్బంది అక్రమ లేఅవుట్లను తొలగించారు. కొనుగోలుదారులు ఈ అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొని మోసపోవద్దని గ్రామ పంచాయతీ అధికారులు స్పష్టం చేశారు.
అక్రమ లేఅవుట్ల గుట్టు రట్టు - గ్రామ సంపద
అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి గ్రామ సంపదను కొల్లగొట్టడానికి ప్రయత్నించిన కొంత మంది అక్రమార్కుల గుట్టు రట్టు చేసిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్ అప్రమత్తతో అవినీతి పరుల ఆగడాలను అధికారులు అడ్డుకుని అక్రమ లేఅవుట్లను తొలగించారు.
గ్రామ సర్పంచ్ అప్రమత్తతో అవినీతి పరుల ఆగడాలకు అడ్డుకట్ట