ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ సమీపంలోని రామరావు చెరువు అలుగు పారుతోంది. వర్షాల కారణంగా ఐదేళ్ల క్రితం నిండుకున్న చెరువు.. మళ్లీ ఇప్పుడు పూర్తిస్థాయిలో నిండి ప్రవహిస్తుడడం చూసి పట్టణ ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చాలాకాలం తర్వాత అలుగుపోస్తున్న రామరావు చెరువు..
భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లా నర్సాపూర్లోని చెరువులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. రామరావు చెరువు ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అలుగుపోస్తుండడం చూసి ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చాలాకాలం తర్వాత అలుగుపోస్తున్న రామరావు చెరువు..
నర్సాపూర్ నియోజకవర్గములోని చెరువులన్నీ నిండుకుండాలా మారాయి. వరుణ దేవుడు కరుణించాడని.. గంగమ్మకు పూజలు చేస్తున్నారు. పట్టణంలోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధుల్లోకి వరద నీరు చేరడం వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
ఇదీ చూడండి:అనాజ్‌పూర్, యూకే గూడ మధ్య రోడ్డుపై ప్రవహిస్తున్న నీరు