తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీ వర్షంతో జలకళ సంతరించుకున్న చెరువులు - రాయరావు చెరువులోకి వరద నీరు వార్తలు

మెదక్​ జిల్లా నర్సాపూర్​లో భారీ వర్షం కురిసింది. వాగులు, చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. ఇన్ని రోజులుగా నీరు లేక వెలవెలబోయిన చెరువులు జలకళ సంతరించుకోవడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

heavy rain at narsapur in medak district
భారీ వర్షంతో జలకళ సంతరించుకున్న చెరువులు

By

Published : Sep 26, 2020, 1:53 PM IST

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఫలితంగా పట్టణంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. స్థానిక రాయరావు చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. చెరువుకు ప్రధాన వనరు అయిన పందివాగు నుంచి చెరువుకు వరద నీరు పోటెత్తింది.

ఇన్ని రోజులుగా నీరు లేక వెలవెలబోయిన రాయరావు చెరువు జలకళ సంతరించుకుంది. వర్షం నీటితో కళకళలాడుతుంది. ఈ క్రమంలో రాయరావు, పందివాగు చెరువు అందాలను చూడటానికి పట్టణవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి పంటలకు నీరు సమృద్ధిగా అందుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీచూడండి:అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్లకు సీఎస్​ ఆదేశం

ABOUT THE AUTHOR

...view details