మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో వలస కార్మికులకు నిత్యావసరాల పంపిణీలో గందరగోళం నెలకొంది. స్థానిక పాఠశాల ఆవరణలో నిత్యావసరాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు అధికారులు. గేట్ తెరవగానే కార్మికులు పెద్ద ఎత్తున రావడం వల్ల తోపులాట జరిగింది. తహసీల్దార్ శ్రీదేవి జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
నిత్యావసరాల పంపిణీలో తోపులాట - నిత్యావసరాల పంపిణీ
వలస కార్మికులకు నిత్యావసరాల పంపిణీలో తోపులాట జరిగిన ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో చోటుచేసుకుంది. తహసీల్దార్ జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
నిత్యావసరాల పంపిణీలో తోపులాట