తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆటల్లోనూ ముందుంటాం.. - tngo

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో రెండు రోజుల నుంచి మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ క్రీడలతో జిల్లా పాలనాధికారి కార్యాలయంలో సందడి నెలకొంది.

ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

By

Published : Mar 7, 2019, 8:07 PM IST

ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
ఎప్పుడూ కార్యాలయాల్లో విధి నిర్వహణలో సందడిగా ఉండే మహిళలు ఒక్కసారిగా క్రీడాకారులుగా మారిపోయారు. విధులతో పాటు ఆటల్లోనూ ముందుంటామని నిరూపించారు. ఇందుకు మెదక్​ జిల్లా కలెక్టరేట్ వేదికైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐసీడీఎస్, టీఎన్జీవోల ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్, స్పీడ్ వాక్ వంటి క్రీడా పోటీలను నిర్వహించారు. ఇలా క్రీడలను సంవత్సరానికి ఒక్కరోజే కాకుండా అప్పుడప్పుడు నిర్వహిస్తే పని ఒత్తిడి దూరమవుతుందని మహిళా ఉద్యోగులు తెలిపారు. వృత్తిపరంగా ఒత్తిడిని దూరం చేసేందుకు ఉద్యోగులు క్రీడల పట్ల దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details