తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త జిల్లాల వారీగా త్వరలో మత్స్య సహకార సంఘాలు!

జిల్లాల పునర్​వ్యవస్థీకరణ నేపథ్యంలో కొత్త జిల్లాల వారీగా త్వరలో మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. అప్పటివరకు పాత జిల్లాల ప్రతిపాదికన మత్స్య సహకార సంఘం కొనసాగుతుందన్నారు. మెదక్ పట్టణంలో మత్స్య శాఖ అధికారి శ్రీనివాస్ అధ్యక్షతన ఉమ్మడి జిల్లా మత్స్యకారుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

fisheries-sarva-sabhya-meeting-in-medak-district
కొత్త జిల్లాల వారీగా త్వరలో మత్స్య సహకార సంఘాలు!

By

Published : Jan 20, 2021, 10:08 AM IST

రాష్ట్రంలో కొత్త జిల్లాల వారీగా మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు గున్నల నర్సింహులు తెలిపారు. అర్హులైన మత్స్యకారులందరికీ పింఛన్లు, రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్​కు విన్నవించినట్లు తెలిపారు. మెదక్ పట్టణంలో మత్స్య శాఖ అధికారి శ్రీనివాస్ అధ్యక్షతన ఉమ్మడి జిల్లా మత్స్యకారుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

అప్పటివరకు పాత జిల్లాల ప్రతిపాదికన మత్స్య సహకార సంఘం కొనసాగుతుందన్నారు. జిల్లాల పునర్​వ్యవస్థీకరణ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట మత్స్యశాఖ అధికారులు శ్రీనివాస్, సుజాత, వెంకటయ్య, మత్స్య సహకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గేశ్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:హీరాగోల్డ్‌ కేసులో నౌహీరాకు తాత్కాలిక బెయిల్‌ మంజూరు

ABOUT THE AUTHOR

...view details