మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులోని మూతపడిన బీఎస్ స్టీల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద వశాత్తు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున ఎగిసి పడ్డాయి. పరిశ్రమ ఆవరణలో నిలిపి ఉంచిన మూడు క్రేన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
మూతపడిన స్టీల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. లక్ష ఆస్తి నష్టం - మెదక్ జిల్లా
మూతపడిన స్టీల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా.. లక్ష వరకు ఆస్తి నష్టం జరిగింది.
మూతపడిన స్టీల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. లక్ష ఆస్తి నష్టం
పరిశ్రమ మూతపడి ఉండడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే రూ. లక్ష ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఇవీ చూడండి:మూడు వారాలుగా జలసమాధిలోనే ఎమ్మెల్యే సోదరి కుటుంబం!