ETV Bharat / state
పాఠశాలలో చెలరేగిన అగ్నికీలలు - school
మెదక్ జిల్లాలోని సీతారాం తండా ప్రాథమిక పాఠశాలలోని వంటగదిలో షాట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది.
పాఠశాలలోని వంటగదిలో అగ్నిప్రమాదం
By
Published : Mar 12, 2019, 6:49 AM IST
| Updated : Mar 12, 2019, 9:48 AM IST
పాఠశాలలోని వంటగదిలో అగ్నిప్రమాదం మెదక్ జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. శివ్వంపేట మండలం సీతారాం తండాలోని ప్రాథమిక పాఠశాల వంట గదిలో షాట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల ధాటికి గదిలోని గ్యాస్ సిలిండర్ పేలి అగ్నికీలలు చెలరేగాయి. సిలిండర్ పేలుడు ఘటనలో వంటిగది గోడలు కూలిపోగా.. తరగతి గదుల గోడలకు భారీ రంధ్రాలు పడ్డాయి. ప్రమాదం రాత్రి ఎనిమిది గంటల సమయంలో జరగడం వల్ల విద్యార్థులకు ముప్పు తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. Last Updated : Mar 12, 2019, 9:48 AM IST