మెదక్ కలెక్టరేట్లో పల్లె ప్రగతి పారిశుద్ధ్యం, వరి ధాన్యం సేకరణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. అనంతరం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు మెదక్ పట్టణంలో పర్యటించారు. కలెక్టరేట్లో పల్లె ప్రగతి పారిశుద్ధ్యం, వరి ధాన్యం సేకరణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు.