మెదక్ జిల్లా శివ్వంపేట మండలం లింగోజిగూడ తండాకు చెందిన నేనావత్ దేవిసింగ్ అనే రైతు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి కొత్తపేట శివారులో 2.05 ఎకరాల భూమి ఉంది. అందులో బోరుబావులు తవ్వించగా చుక్కనీరు రాలేదు. పంటలు పండక అప్పులు పెరిగిపోయాయి. తరచు భార్య నీలతో చెబుతూ బాధపడేవాడు. మెల్లమెల్లగా అప్పులు తీర్చవచ్చని ఆమె అతనికి ధైర్యం చెప్పేది. ఇలా ఉండగా ఇవాళ ఇంట్లోనే దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలిసులు తెలిపారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య - Farmer Suicide For Debts in Medak district
అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, పంట నష్టంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు మెదక్ జిల్లా శివ్వంపేటలో ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
TAGGED:
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య