తెలంగాణ

telangana

ETV Bharat / state

'తాగునీటి సమస్య లేకుండా చేస్తా' - మున్సిపల్​ ఛైర్మన్​ మురళి యాదవ్​ తాజా వార్త

మెదక్​ జిల్లా నర్సాపూర్​ పురపాలికలోని పలు అభివృద్ధి పనులను మున్సిపల్​ ఛైర్మన్​ మురళి యాదవ్​ పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

development works opening by municipal chairman in medak
'తాగునీటి సమస్య లేకుండా చేస్తా'

By

Published : Mar 5, 2020, 4:48 PM IST

మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలికలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తామని మున్సిపల్ ఛైర్మన్ మురళి యాదవ్ ప్రజలకు హామీ ఇచ్చారు. తొమ్మిదో వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బోరును ప్రారంభించారు. అనంతరం పలు వార్డుల్లో పర్యటిస్తూ వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.

కొంతమంది ప్రజలు తమ సమస్యలను ఛైర్మన్​ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సునీతా బాల్​రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

'తాగునీటి సమస్య లేకుండా చేస్తా'

ఇవీ చూడండి:కరోనాపై ప్రముఖుల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details