మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద నిర్మిస్తున్న కల్వర్టు పనులను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యవేక్షించారు. డిసెంబర్ మొదటి వారం వరకు గాంధీ నగర్ నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయడంతో పాటు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పూర్తవుతుందని చెప్పారు. డిసెంబర్ చివరి వరకు రాందాస్ చౌరస్తాలో నిర్మిస్తున్న కల్వర్టును పూర్తి చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్ పాల్గొన్నారు.
'డిసెంబర్ చివరిలోపు అభివృద్ధి పనులను పూర్తి చేస్తాం' - నిర్మాణ పనులు
మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద నిర్మిస్తున్న కల్వర్టు పనులను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పరిశీలించారు. డిసెంబర్ చివరి వారంలోపు పట్టణంలోని వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని హామి ఇచ్చారు.
'డిసెంబర్ చివరిలోపు అభివృద్ధి పనులను పూర్తి చేస్తాం'