తెలంగాణ

telangana

ETV Bharat / state

దెబ్బతిన్న కొల్చారం ప్రధాన రహదారి... మరమ్మతులెప్పుడు ? - కొంగోడు, జలాల్​పూర్

మెదక్ జిల్లా కొంగోడు, జలాల్​పూర్, అంసానిపల్లి, పోతిరెడ్డిపల్లి మీదుగా మండల కేంద్రం కొల్చారానికి వెళ్లే ప్రధాన రహదారి మరమ్మతులకు నోచుకోక పూర్తిగా దెబ్బతింది. వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు అధికారులకు స్థానికులు మొరపెట్టుకుంటున్నారు.

దెబ్బతిన్న కొల్చారం ప్రధాన రహదారి... మరమ్మతులెప్పుడు ?

By

Published : Aug 1, 2020, 7:08 PM IST

మెదక్ జిల్లా కొంగోడు, జలాల్​పూర్, అంసానిపల్లి, పోతిరెడ్డిపల్లి మీదుగా మండల కేంద్రం కొల్చారానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. ఆరు కిలోమీటర్ల ప్రయాణం మేర 4 గ్రామాల ప్రజలకు నరకంలా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక చోట్ల రహదారి గుంతలమయంగా మారి ప్రయాణికులు, వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.

మొత్తం గుంతలమయమే...

రోడ్డు మొత్తం గుంతలమయంగా మారడం వల్ల వాహనాలు తరుచూ రిపేర్లు వస్తున్నాయని వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి పనుల నిమిత్తం ఈ రహదారిపై కాకుండా వేరే మార్గంలో వెళ్తున్నారని... దాని వల్ల రెండు కిలోమీటర్ల దూరం ఎక్కువవుతుందన్నారు.

చిన్నపాటి వర్షానికే...

చిన్నపాటి వర్షం పడ్డప్పుడు గుంతల్లో నీరు చేరి ఏ గుంత ఎక్కడుందో కూడా తెలియని దుస్థితి నెలకొందని వాపోయారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రజా ప్రతినిధులు, అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి : దేశంలో ఏ పార్టీకి లేని పటిష్ఠమైన యంత్రాంగం తెరాసకు ఉంది: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details