మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో 104 మంది హమాలీ, ఆటో, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పంపిణీ చేశారు. బయటకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించి వైరస్ రాకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని ఆమె అన్నారు.
మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని.. శానిటైజర్ వాడాలని ఎమ్మెల్యే తెలిపారు.