తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రలోభపెడితే సి-విజిల్​కు ఫిర్యాదు చేయండి: కలెక్టర్

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మెదక్ జిల్లాలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈవీఎం యంత్రాల మొదటి దశ పరిశీలన పూర్తైందని తెలిపారు. ఓటర్లను ప్రలోభపెడితే సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఓటర్లకు సూచించారు.

By

Published : Mar 23, 2019, 4:56 PM IST

ఈవీఎం యంత్రాల్లో పూర్తైన మొదటి దశ పరిశీలన : కలెక్టర్

ఎన్నికల నిర్వహణపై పీఓ, ఏపీవోలకు మొదటి దశ శిక్షణ పూర్తైందని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. రెండో విడత కార్యక్రమం వచ్చే నెల 2 లేదా 3న నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

సి-విజిల్​కు ఫిర్యాదు చేయండి

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఓటర్​ను ప్రలోభపెడితే సి-విజిల్ యాప్, లేదంటే జిల్లా కలెక్టర్​ వాట్సప్ నెంబర్​కు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూచించారు. మెదక్ పార్లమెంట్​ పరిధిలోని 2044 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు.

ఈవీఎం యంత్రాల్లో పూర్తైన మొదటి దశ పరిశీలన : కలెక్టర్

ఇవీ చూడండి :కేసీఆర్ ఎస్టేట్​గా రాష్ట్రం మారిపోతుంది: భట్టి


ABOUT THE AUTHOR

...view details