ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయం నుంచి పురవీధుల గుండా విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్, భాజపా శ్రేణులు శోభాయాత్ర నిర్వహించారు. రాందాస్ చౌరస్తాలో శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
'హిందూ ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం 'శివాజీ'' - sivaji birth anniversary in medak
శివాజీ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఛత్రపతి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ రామరాజ్య స్థాపనకు కృషి చేయాలని భాజపా జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ సూచించారు.
హిందూ ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం చత్రపతి శివాజీ అని భాజపా జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అన్నారు. విదేశీ దురాక్రమణదారులను తరిమి కొట్టి, స్వదేశీ కుట్రదారుల వెన్నులో వణుకు పుట్టించిన మహోన్నత శక్తి శివాజీ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ రామరాజ్య స్థాపనకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కాశీనాథ్, వనపర్తి వెంకటేశం, భజరంగ్ దళ్ సభ్యులు నరేందర్, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'వామనరావు తల్లిదండ్రులకు ప్రాణభయం ఉందని చెప్పారు'